
ఎమ్మెల్యే కీ లక్ష్మినరసింహ స్వామి జాతర ఆహ్వాన పత్రిక అందజేత
బెజ్జంకి, మార్చి 25(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలో ఏకశిలా గుట్టపై కొలువుదీరిన బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈ నె
ల మార్చి 25 న ప్రారంభమై 15రోజుల పాటు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు, మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కీ ఆలయ చేర్మెన్ జెల్ల ప్రభాకర్, ఆలయ పూజారి,బెజ్జంకి మండల నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనీ దేవస్థాన కమిటికీ సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, ఆలయ పూజారి మధుసూదన చారి, రావుల నర్సయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



