కడప జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11) ఈనెల 19 20 తేదీలలో బద్వేలు లో జరగబోయే కడప జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని,దళిత హక్కుల పోరాట సమితి కడప జిల్లా అధ్యక్షులు ప్రజలకు పిలుపునిచ్చారు.శనివారం పోరుమామిళ్లలో ముఖ్య నాయకుల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఇమ్మానుయేలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనుషులకు స్వాతంత్రం సమానత్వం సౌబ్రాతృత్వం నిర్దేశించింది.కానీ భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసిన పాలకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మనుషుల హక్కులను కాల రాసే ప్రయత్నం సాగిస్తున్నారన్నారు.భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు దాటి 80వ సంవత్సరం అయినా ఈ దేశంలో మనుషులలో దళితులుగా పిలవబడే వారి పరిస్థితి ఇంకా దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది అంటరానితనం నిషేధం అంటూ వివక్షల మంటల్లో అణగారిన వారిని కాల్చి మసి చేస్తున్నారు.అయినా ఏలేటి ప్రభుత్వాలకు ఈ విషయం కానరాదు కనిపించిన వినిపించరు బాధితులది మూగవేదనే దేశంలో దళితులపై క్షణానికి ఒక మానభంగం హత్య,లైంగిక వేధింపులు,హత్యాచారాలు,జరుగుతుంటే అవి పట్టని ప్రభుత్వాలు తినే ఆహారం పైన కట్టే బట్ట పైన నడిచే నడక పైన ఆంక్షల సంకెళ్లు విధించి ఆధునిక యుగంలో కూడా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు ప్రశ్నించే గొంతులపై దేశద్రోహం రాజ ద్రోహం లాంటి కేసులు బనాయిస్తున్నారు ఇంకొక అడుగు ముందుకేసి మతం మత్తుగాండ్ల చేతులకు కత్తులు ఇచ్చి విసరమంటూ ఉసిగొలుపుతున్నారు.ఇది ఎక్కడి న్యాయం అంటే ఇంతేనంటూ మనుషులకు మతం రంగు కులుముతున్నారన్నారు.ఓ అభివృద్ధి చెందుతున్న భారత దేశమా!కంచికచర్ల,చుండూరు కారంచేడు,నుండి నిన్నటి రంగంపేట మండలం బిక్కి శ్రీను హత్య వరకు ఈ నెత్తుటి సంఘటనలకు మూలాలను శిక్షించిందా ప్రభుత్వం.లేదు నేటికీ నిరాటంకంగానే జరుగుతూనే ఉన్నాయి.ప్రభుత్వాలు మారిన దళితులపై దాడులు దళితులను నిర్దాక్షిణ్యంగా చంపడాలు వారి ప్రాణాలతో వారి మానాలతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితి ఏమైనా మారిందా ఏమీ మారలేదు,ఆత్మగౌరవం ప్రతిక్షణం ఆత్మహత్యకు గురవుతూనే ఉన్నది.అంటరానితనం ఆకలి అనారోగ్యం సాంఘిక బహిష్కరణలు దాడులు దౌర్జన్యాలు హత్యాచారాలు, హత్యాకాండలు అనుభవిస్తూనే ఉన్నారు దళితులు.కానీ పాలకులు సమాజం మాత్రం గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నది తప్ప మాట్లాడడం లేదు. కంటి తుడుపు చర్యలే తప్ప శాశ్వత పరిష్కార మార్గం కనుగొనకుండా ఇంకా అణిచివేతకు గురి చేస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు సెంటు భూమి లేనివారు లక్షల కుటుంబాలు ఉన్నాయి.బారెడు నేల కోసం దళితులు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది ఇక అగ్రకుల సంపన్న వర్గాలు మరియు ఆర్ఎస్ఎస్ భజరంగదళ్ విశ్వ హిందూ పరిషత్ లాంటి ఫాసిస్టు శక్తులు సామాజిక సమీకరణలో భాగమైన రిజర్వేషన్లు పూర్తిగా తుంచి వేయాలని కుట్రలో రిజర్వేషన్ను ప్రతిభకు ముడిపెడుతూ దళిత జాతిని అవమానిస్తూనే మానసిక హాత్యకవించాలని పన్నాగం పన్నుతున్నాయి అని వారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమం అంటూ సన్నాయిరాగం పాడుతూ తెల్ల కాగితాలపై అంకెల గారడీ బడ్జెట్ను చూపిస్తూ అది కూడా ఖర్చు చేయకుండా వారి సొంత కాంట్రాక్టర్లకు మల్లిస్తూ దళితుల నోట్లో మట్టికొడుతున్నారు. దళితులను పారిశ్రామికవేత్తలు చేస్తామంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.దళితులకు దళిత పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన బకాయిలను సంవత్సరాల తరబడి నిలుపుదల చేస్తున్నారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరణల పేరుతో తూట్లుపొడిచేందుకు కుట్ర పండుతున్నారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమల్లిస్తూ ఆర్థికంగా ఆదుకునే పథకాలకు ఆంక్షలు విధించి అందకుండా చేస్తున్నారు అని వారి తెలిపారు.భూమి కొనుగోలు లాంటి పథకాన్ని పక్కన పెట్టేశారు కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు మూలన పడేసారన్నారు.భారత దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు రిజర్వేషన్లకు తిలోదకాలు ఇస్తున్నారు ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్లకు నిరాకరిస్తున్నారు ఇది పాలకుల కుతంత్ర పాలనకు నిదర్శనం కాదా దళితులపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నదా .సనాతన ధర్మం అంటూ కాషాయపు మత విషనాగులు చిమ్మే అతి భయంకరమైన విషం కాటుకు బలై తల్లడిల్లుతున్నది దళిత సమాజం అలాగే భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అసత్య ప్రచారాలతో ముంచేత్తుతున్న ఈ దుర్మార్గ పాలకుల ఆలోచన విధానాన్ని ఏమనాలి
ముఖ్యంగా దళిత యువత అభిమానం వలలో పడి ఆదరించి మనుషులను మనుషులుగా మట్టి మనుషుల వెలివాడల శ్రేయస్సుకై అహర్నిశలు పోరాటం చేసే మహనీయుల గురించి తెలుసుకోకుండా కాలయాపన సాగిస్తున్నారు.దళిత హక్కుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం దళిత హక్కుల పోరాట సమితి నిరంతరం పై అన్ని విషయాలపై పోరాడుతూనే ఉన్నది రిజర్వేషన్లు చట్టాలు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేటట్టు చేయడానికి నిత్యం దళిత జనబాహుల్యాన్ని తట్టి లేపి చైతన్యపరిచి వారిని ముందుకు నడిపేందుకు స్వతంత్ర ఐక్య ఉద్యమాలను నిర్మిస్తున్నది.దోపిడీల నుండి వివక్షల నుండి మత కుల వర్గ లింగ వర్ణ పీడనల నుండి దళిత సమూహాన్ని విముక్తి చేయడానికి భారత రాజ్యాంగం అనే పునాదిపై ఆధారపడ్డ ఈ భారతదేశ ఆదర్శ సమాజాన్ని నిర్మించడానికి అహర్నిశలు డి హెచ్ పి ఎస్ ఉద్యమ బాటలో పయనిస్తున్నది మేథోమధనాలను జరుపుతున్నది చర్చా వేదికలు నిర్వహిస్తున్నది సభలు సమావేశాలు ప్రదర్శనను నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో దళిత జనబాహుల్యాన్ని మేలుకొలిపి మనమందరం కలిసి చర్చించుకుందాం రండి మనమంతా మాట్లాడుకుందాం రండి మన గొంతే మనకు ఆయుధం మనం మాట్లాడకపోతే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం భయం 100 కిలోమీటర్లు వెనకకు తీసుకు పోతుంది అని మనలో ధైర్యాన్ని నింపి కలిసి ముందుకు నడుద్దాం రమ్మంటుంది దళిత హక్కుల పోరాట సమితి ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ కులాల వారు ఎదుర్కొంటున్న వివక్ష రూపాలు ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యలు వారి హక్కులకై పాలకుల నిరంకుశ వైఖరిని ఖండించేందుకు సమాయత్తమవుతుంది భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు రూప నిర్మాణాన్ని నిర్మిస్తోంది దళితులారా నీలోని మాటను నువ్వే మాట్లాడాలి నీకోసం నువ్వే పోరాడాలి. అప్పుడే నీ గురించి ఈ దేశానికి ఈ సమాజానికి తెలుస్తుంది నీకు రావాల్సింది అడుక్కుంటే కాదు నీకు రావాల్సిన హక్కు పోరాడుతేనే వస్తుంది.ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్లని మానసిక వికలాంగులుగా బానిసలుగా బతుకుదాం పిడికిలి బిగిద్దాం దళిత హక్కుల పోరాట సమితి జండాను భుజంపై ఎత్తుకుందాం ఇక పోరాటమే శరణ్యంగా ముందుకు సాగుదాం.ఈ నేపథ్యంలో బద్వేలులో జరగబోయే కడప జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలు నాంది కానున్నాయని ఈ మహాసభలకు బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా దళిత ప్రజానీకం పాల్గొన్న జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ బద్వేలు ఏరియా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, పెంచలయ్య, నాయకులు బి కోడూరు ప్రసాద్,రాయప్ప, విజయకుమారి,నరసింహ జాకోబ్, మునిరత్నం, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు
ఈనెల 19 20 తేదీలలో జరగబోయే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి,,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమ్మానుయేలు
RELATED ARTICLES



