ఘట్‌కేసర్, మే 13 (ప్రజావాణి): పేదల సొంతింటి కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలోని ఫకీర్ టేక్య తండాలో వడ్త్యా జ్యోతి, నానావత్ బుజ్జి నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పేదల కలల్ని నిజం చేసే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు అవుతోందన్నారు. ప్రతి గృహప్రవేశం ఒక చిన్న పండుగలా మారిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిందన్నారు.
గత ప్రభుత్వం పేదలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాలను కల్పిస్తోందన్నారు. ఇంటి నిర్మాణానికి దశల వారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్లు నానావత్ రూప్‌సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్జకుంట నర్సింహా, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు బింగి సురేష్ గౌడ్, వడ్త్యా జైహిందర్ నాయక్, వడ్త్యా చాంది, నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, నాయకులు కొంశెట్టి శ్రవణ్, వడ్త్యా సురేష్ నాయక్, వడ్త్యా దేవ్‌సింగ్ నాయక్, మూడవత్ చందర్, నానావత్ రాజ్‌కుమార్, రామావత్ మల్లికార్జున్‌తో పాటు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




