ప్రజావాణి న్యూస్(మార్చి20)బద్వేల్ పట్టణంలోని ఇంటి పట్టాలు ఇవ్వకపోతే, స్థానిక సంస్థల్లో ప్రజలతో గ్రామాల్లో అడ్డుకుంటాం ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆగ్రహం పేదల ప్రాథమిక హక్కులైన ఇల్లు, రేషన్ కార్డులు,పింఛన్లు ఇప్పటికీ అనేక మంది అర్హులకు అందకపోవడం దారుణమని,జీవో నెంబర్ 23 ప్రకారం అర్హులైన వారందరికీ బద్వేల్ పట్టణంలో రెండు సెంట్లు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలని ఈనెల 24న మంగళవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పిడుగు మస్తాన్ మాట్లాడుతూ.బద్వేల్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం జేవి భవనం నందు శాఖ కార్యదర్శిల,ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ప్రభుత్వం “అందరికీ గృహవసతి” పథకం కింద ఇంటి స్థలాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.ప్రత్యేకంగా వార్డు సచివాలయ స్థాయిలో అర్హుల జాబితా కూడా ఇప్పటివరకు సిద్ధం చేయకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.సొంత ఇంటి కోసం పేద,మధ్య తరగతి వర్గాలు పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా,ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు.అర్హులైన అనేక కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు,వృద్ధాప్య/వితంతు/వికలాంగ పింఛన్లు కూడా మంజూరు చేయకపోవడం వల్ల పేదల జీవితం మరింత కష్టాల్లో పడిందన్నారు.ఈ నేపథ్యంలో పేదల హక్కుల సాధన కోసం ఈనెల 24వ తేదీన బద్వేల్ ఆర్డిఓ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకున్న వారు,కొత్త రేషన్ కార్డులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు అందరూ రావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు. ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానియేల్ జిల్లా సమితి సభ్యులు పడిగా వెంకటరమణ ఏరియా కార్యవర్గ సభ్యులు విజయమ్మ.నాగేష్. సలోని.మునిరత్నం నాగసుబ్బయ్య ఓబులపతి.రామసుబ్బారెడ్డి. నరసయ్య. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పట్టాలు, కోసం జీవో నెంబర్ 23 అమలు కోరుతూ 24న బద్వేల్ ఆర్డీవో కార్యాలయం వద్ద సి.పి.ఐ ఆందోళన
0
14




