📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు

ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు

📰 Generate e-Paper Clip

అచేతన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ ఫిబ్రవరి 07 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం సంతపూరి ప్రవీణ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడడంతో అతని వెన్నుపూసకు బలమైన గాయం కాగా, సుమారు 7సంవత్సరాల నుండి వీల్ చైర్ కు పరిమితమయ్యాడు, ఇటీవల ప్రవీణ్ తల్లి కి సైతం కాలు విరగడంతో ఎలాంటి పని చేయాలోని స్థితిలో ఇంటి పట్టునే ఉంటున్నారు, వీరికి ఎలాంటి ఆస్తి పాస్తులు లేక అచేతన స్థితిలో చేరుకున్నారు, ఎలాంటి ప్రభుత్వ భృతి (పింఛను) రావడం లేదు, ఈ విషయాన్ని గ్రహించిన స్థానిక వార్డు సభ్యులు ఎర్రగొకుల శశికుమార్ వీరి పరిస్థితి ని జగదేవ్ పేట వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టగా, పలువురు గ్రామస్తులు స్పందించి 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది, ఈ నగదును గ్రామ సర్పంచ్ నల్ల తిరుపతి, గ్రామీణ వైద్యుడు తిరుపతి రెడ్డి, కోర్రి సురేందర్, ఎర్రగొకుల శశికుమార్ కోర్రి సతీష్, సలాది సంతోష్, క్యాతం చిట్టి, లు ప్రవీణ్ కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులకు ప్రవీణ్, అతని తల్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular