సిద్దిపేట, మార్చి 29, ప్రజావాణి
కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, సిద్దిపేట పట్టణంలోని టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకి రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగింది, ఇందులో భాగంగా టాక్సీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి నడపకూడదని, ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ కచ్చితంగా ధరించాలని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలు గురి కావద్దని, మీ ప్రాణాలతో పాటు టాక్సీలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతిలో ఉంటాయి కాబట్టి గమ్యస్థానం చేరేవరకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ప్రతి ఒక్కరూ మీ యొక్క వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంచుకోవాలని చెప్పారు, ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్, మహేష్ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్బు రమేష్,
డ్రైవర్స్ పాల్గొన్నారు,




