📄 ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఅమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు

అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

*అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు*

*గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్*

టేక్మాల్ జూన్ 2: (మన ప్రజావాణి) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుసంగి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ జాతీయ జెండా ఎగరవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.ప్రత్యేక తెలంగాణ కల సాకారం కావడంలో ఈ అమరవీరుల పాత్ర వారి ఆశయాలకు అనుగుణంగా భావితరాలు నడుచుకోవడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి! అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వం ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏ ఈ ఓ ఇంద్రయ్య డా,, హనుమంతు అంగన్వాడీ టీచర్లు సరిత, ఇందిరా,సుశీల,వార్డు మెంబర్లు రాజు, వెంకట్ గౌడ్, అనిల్ గౌడ్, దుర్గయ్య, సతీష్, మహిపాల్, గ్రామ పెద్దలు లక్ష్మయ్య, జగదీశ్వర్ రెడ్డి, అడివయ్యా రామ్ రెడ్డి, శ్రీనివాస్,వినోద్ గౌడ్, పి రాజు,రవి, వెంకయ్య, మొగులయ్య, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular