📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఅభివృద్ధి పనుల పై గ్రామ సభ

అభివృద్ధి పనుల పై గ్రామ సభ

📰 Generate e-Paper Clip

పలు అభివృద్ధి పనుల పై గ్రామ సభ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి04 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు స్థానిక సర్పంచ్ మారం సునీత రెడ్డి అధ్యక్షతన పలు అభివృద్ధి పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారంపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు. మండల కేంద్రాన్ని మరింత మెరుగుపరిచేలా నూతనంగా ఏర్పాటు చేయనున్న డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి, గ్రామ పంచాయతీ సభ్యులు స్థలాన్ని పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు కోసం గ్రామ సభలో వినతి పత్రాన్ని అందజేశారు. పలు ప్రభుత్వ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటుకు అవసరమైన స్థలాలపై కూడా పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యాక్రమం లో గ్రామ కార్యదర్శి ప్రభాకర్, వార్డు సభ్యులు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular