ఘట్కేసర్: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత లక్ష్యంగా ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అన్నోజిగూడలోని డిమార్ట్ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మంది వాహనదారులను గుర్తించారు.
ఈ సందర్భంగా ఆర్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సోమయ్య, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి, రమేష్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ ఇబ్రహీం, కానిస్టేబుళ్లు కృష్ణ, రవితేజ, మహిళా కానిస్టేబుల్ మంగ, లా అండ్ ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కృష్ణ , పాల్గొన్నారు.




