📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఅనారోగ్యంతో బాధపడుతున్న మిత్రునికి పూర్వ విద్యార్థుల అండ

అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రునికి పూర్వ విద్యార్థుల అండ

📰 Generate e-Paper Clip

తోటి మిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

25 వేల రూపాయల ఆర్థిక సహాయం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 11 (ప్రజావాణి):

పాఠశాల రోజుల్లో పంచుకున్న జ్ఞాపకాలు కేవలం మధుర అనుభూతులు మాత్రమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే ధైర్యమని పాతగూడూర్ పూర్వ విద్యార్థులు నిరూపించారు. 2004-05 వ విద్యా సంవత్సరంలో పాతగూడూర్ గ్రామంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు తమ తోటి మిత్రుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన కొక్కుల రాజేశం, 2004-05 బ్యాచ్‌లో పాతగూడూర్‌లో చదువుకున్నాడు. ఇటీవల రాజేశం అనారోగ్యానికి గురికావడంతో, గుండెకు (స్టంట్) శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేశం ఆపరేషన్ ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న తోటి మిత్రులు చలించిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకొని, సామాజిక మాధ్యమాల ద్వారా తమ పూర్వ విద్యార్థులు ఒకరికొకరు చేర వేసుకొని, వెంటనే సహాయం చేయడానికి తమ వంతుగా చందాలు వేసుకొని, మొత్తం 25,000 రూపాయలను రాజేశం కు శస్త్ర చికిత్స అనంతరం ఆర్థిక సాయంగా అందజేశారు. చదువుకునే రోజుల్లో కలిసున్న మిత్రుడు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాం. మా ఈ చిన్నపాటి సాయం అతనికి ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం అని మిత్రబృందం పేర్కొంది. స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబానికి చెందిన రాజేశం ను ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందించారు. చిన్ననాటి స్నేహం వయస్సు పెరిగినా సడలలేదని, ఈ సంఘటన నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular