అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంట
బెజ్జంకి,ఏప్రిల్ 1(ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లె గ్రామానికి చెందిన రైతు రాజేందర్ సాగుచేసిన మొక్కజొన్న పంట అకాల వర్షాలకు దెబ్బతింది.ఆయన 5 ఎకరాల్లో పంట సాగు చేయగా, సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా సుమారు 2 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయింది.ఇంకా 20 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట ఈ వర్షంతో నేలకూలిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క అకాల వర్షంతో దాదాపు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతు రాజేందర్ కోరారు.


