📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంబేద్కర్ అందరివాడు ప్రపంచ మేధావి.

అంబేద్కర్ అందరివాడు ప్రపంచ మేధావి.

📰 Generate e-Paper Clip

  1. అంబేద్కర్ అందరివాడు
    ప్రపంచ మేధావి.

ప్రజావాణి
ఏప్రిల్ :14
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

భారత రాజ్యాంగ నిర్మాత జాతిపిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినమును పురస్కరించుకొని మంగళవారము జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూజెఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణచారి, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ లు మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి దిక్సూచి అనే అన్నారు . మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా గుర్తించిన మేధావి కేవలము డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన జాతిపిత అంబేద్కర్ ఏ కులానికో, ఈ వర్గానికో, ఏ మతానికో చెందిన వ్యక్తి కాదని ఈయన అందరివాడు అని తెలిపారు. కొన్ని శక్తులు ఈయన పేరును చెరిపివేయాలని చూస్తున్నారు కానీ ఈయన పేరును ఎవరు కూడా చెరిపి వేయలేరని ఈయన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు కృష్ణమూర్తి ,జిల్లా మాజీ అధ్యక్షుడు బోక్కల వేణు, రాజేష్ కాషా గౌడ్,
పిట్ల.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
బట్రాజులను కించపరిచే వాక్యాలు చేస్తే సహించేది లేదు. ప్రభుత్వం నిరుపేద భట్రాజులకు సంక్షేమ పథకాలు అందించాలి. కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి ముఖ్యమంత్రి సహకరించాలి. బట్రాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు విలాస కవి రామరాజు డిమాండ్ ప్రజావాణి న్యూస్ సూర్యాపేట. బట్రాజులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సూర్యాపేట జిల్లా బట్రాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు విలాస కవి రామరాజు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటినుంచి కూడా బట్రాజులు మంచి గౌరవప్రదమైన పేరు ప్రతిష్టలను సంపాదించారని వాపోయారు. జిల్లాలో ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు అయినందున జిల్లాలో ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా బొల్లేపల్లి రఘురామరాజు మరియు గౌరవ అధ్యక్షులుగా విలాస కవి రామరాజు ప్రధాన కార్యదర్శిలుగా వేణుగోపాల కృష్ణంరాజు. దేనుమకొండ శేషం రాజు ఉపాధ్యక్షులు సరికొండ రామలింగరాజు మందపాటి శ్రీరామరాజు సరికొండ నాగరాజు కాసు రాఘవ రాజు సరికొండ బలరామరాజు మరియు. కోశాధికారి తంగేళ్ల చంద్రశేఖర్ రాజు. కార్యవర్గ సభ్యులు దేనుమకొండ పృథ్వీరాజు బొల్లెపల్లి రామచంద్ర రాజు ధూపాటి అంజమ్ రాజు హర్షవర్ధన్ రాజు దేనుమకొండ సైదరాజులు. ప్రచార కార్యదర్శిగా నక్క నాగరాజు సహాయ కార్యదర్శిగా సందేశ శ్రీనివాసరాజు పదవులలో కొలువుదీరారు. తదనంతరం యువజన సంఘం ఎన్నికలు నిర్వహించగా యువజన అధ్యక్షులుగా మందపాటి శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శిగా సరికొండ చంద్రశేఖర్ రాజు ఉపాధ్యక్షులు కార్తీక్ రాజు సహాయ కార్యదర్శి వినయ్ రాజు కోశాధికారి హర్షవర్ధన్ రాజు ప్రచార కార్యదర్శి పున్నంరాజు కార్యవర్గ సభ్యులు నాగరాజు సాయి రాజు రిశి రాజు అరవింద రాజు యువజన సంఘం లో నియమితులు కావడం జరిగింది. సంఘ ఎన్నికల అనంతరం అధ్యక్షులు బొల్లేపల్లి రఘురామరాజు మాట్లాడుతూ కుల సంఘాలు ఏర్పరచుకునేది అందరినీ కలుపుకొని పోవడానికి గాని స్వార్థపూరితమైన మనసుతో ఒకరిని ఒకరు నిందించుకోవడం కోసం కాదు. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా ఉండి కుల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుల బంధువులు పెద్దలు చిన్నలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular