📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడీ కేంద్రంలో ఫోక్సొ చట్టంపై బాలలకు అవగాహన

అంగన్వాడీ కేంద్రంలో ఫోక్సొ చట్టంపై బాలలకు అవగాహన

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో అంగన్వాడి ఆధ్వర్యంలో కిషోర్ వికాస కార్యక్రమం నందు నందిగామ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు సూపర్వైజర్ ఇష్రత్ బాలలకు ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ ఇష్రత్ మాట్లాడుతూ మగ పిల్లలు కూడా ఫోకస్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని ఫోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని 18 ఏళ్ల లోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ చట్టం 2012 అమల్లో ఉందని తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయడానికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కానీ 10 98 చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ చేయొచ్చు అని తెలిపారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ చట్టం పై అవగాహన అవసరం అన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పు వేస్తే గమనించి కౌన్సిలింగ్ చేయాలని పేర్కొన్నారు. పిల్లల భద్రత విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular