జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) RBI సంచలన నిర్ణయం.₹10,000 పైగా ట్రాన్సాక్షన్ చేస్తే ఇక వెంటనే పేమెంట్ ట్రాన్స్ఫర్ కాదు డిజిటల్ మోసాలను అరికట్టేలా ఆర్బిఐ కొత్త ప్రతిపాదన.డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చే వార్త ఇది.రూ.10,000 కంటే ఎక్కువ డబ్బు పంపితే ఇక వెంటనే వెళ్లదు అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.అవును ఒక గంట వరకు డబ్బు హోల్డ్‌లో పెట్టే కొత్త ప్రతిపాదనను RBI తెరపైకి తెచ్చింది.డిజిటల్ మోసాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో,ఈ కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది.₹10,000 పైగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు,ఆ డబ్బు వెంటనే వెళ్లకుండా.గరిష్టంగా ఒక గంట పాటు “టైమ్ లాగ్” లేదా “కూలింగ్ పీరియడ్” అమలు చేయాలని ప్రతిపాదించింది.ఈ సమయంలో యూజర్‌కు ఒక అవకాశం ఉంటుంది.తప్పుగా పంపించినా,లేదా మోసం అనిపించినా,ఆ ట్రాన్సాక్షన్‌ను క్యాన్సల్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఎందుకు ఈ నిర్ణయం?దేశంలో డిజిటల్ మోసాలు భారీగా పెరిగాయి.ఫేక్ కాల్స్,OTP స్కామ్స్,UPI ఫ్రాడ్స్ వల్ల లక్షలాది మంది నష్టపోతున్నారు.ఈ పరిస్థితిని అరికట్టడానికి ఈ “1గంట ఆలస్యం”ఒక రక్షణగా ఉపయోగపడుతుందని RBI భావిస్తోంది.అందరికీ వర్తిస్తుందా? లేదు,చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్స్‌కు ఎలాంటి మార్పు ఉండదు.షాపుల్లో చేసే పేమెంట్స్ కూడా అలాగే వెంటనే జరుగుతాయి.మరి మీరు తరచూ డబ్బు పంపే వ్యక్తులను“ట్రస్టెడ్ లిస్ట్”లో పెట్టుకుంటే,వాళ్లకు పంపే డబ్బుకు ఈ రూల్ వర్తించకపోవచ్చు.సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రూల్స్:70 ఏళ్లు దాటినవారు ₹50,000 పైగా పంపాలంటేఒక ట్రస్టెడ్ వ్యక్తి అప్రూవల్ అవసరం అయ్యే అవకాశం ఉంది.ఇది ఇప్పుడే అమల్లోకి రాలేదు.ఇది కేవలం RBI విడుదల చేసిన చర్చా పత్రంలో ఉన్న ప్రతిపాదన మాత్రమే.ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు.అయితే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే,డిజిటల్ మోసాలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
Homeఆంధ్రప్రదేశ్RBI సంచలన నిర్ణయం.. ₹10,000 పైగా ట్రాన్సాక్షన్ చేస్తే ఇక వెంటనే పేమెంట్ ట్రాన్స్ఫర్ కాదు!
RBI సంచలన నిర్ణయం.. ₹10,000 పైగా ట్రాన్సాక్షన్ చేస్తే ఇక వెంటనే పేమెంట్ ట్రాన్స్ఫర్ కాదు!
0
9
- Advertisment -




