కామారెడ్డిలో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి..
విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో కిక్కిరిసిన జనాలు!!
గ్రాండ్ ఓపెనింగ్‌లో గ్లామర్ షో,ఫ్యాషన్ షో, స్టార్ షోతో మెరిసిన ప్రారంభ వేడుక!!

మన సమగ్ర ప్రజావాణి : కామారెడ్డి బ్యూరో /
కామారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన విశాల్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఆమె రాకతో కార్యక్రమ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసిపోయింది.
మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన నిధి అగర్వాల్‌ను చూడటానికి యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమె అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ, కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ఈ షాపింగ్ మాల్ స్థానిక ప్రజలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
🪔 సంప్రదాయ పూజలతో శుభారంభం
ప్రారంభోత్సవంలో భాగంగా దీపప్రజ్వలన, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నిధి అగర్వాల్ చేతుల మీదుగా మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
+++ ఫ్యాషన్ షోతో అదనపు ఆకర్షణ
మాల్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ మరియు ఆధునిక దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను అలరించారు.
ప్రారంభోత్సవం రోజున ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ మాల్‌లో సంప్రదాయ పట్టు వస్త్రాలు,మెన్, ఉమెన్ వేర్, కిడ్స్ కలెక్షన్, గిఫ్ట్ ఐటమ్స్, వంటి వివిధ రకాల వెరైటీస్ అందుబాటులో ఉండటం ప్రత్యేకతగా నిలిచింది.
***వాణిజ్య రంగానికి కొత్త ఊపు**
ఈ మాల్ ప్రారంభంతో కామారెడ్డి పట్టణంలో ప్రజలకు అతీతక్కువ అందుబాటు ధరలో నాణ్యమైన పట్టు, ప్యాన్సీ వస్త్రాలు దొరుకుతాయని, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరుగుతాయని నిర్వాహకులు వేముల శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ చేసేందుకు అనువైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. కార్యక్రమం లో ఆయన తో పాటు నిర్వాహకులు వేముల విష్ణు, వెంకటేష్, నాగరాజు,వేణుగోపాల్, నవనీత్,శ్రీరామ్, దేవరాజు, నందరాజ్, రవితేజ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.




