📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకి బ్లూకోర్ట్ పోలీసుల అప్రమత్తత- తప్పిన పెను ప్రమాదం

బెజ్జంకి బ్లూకోర్ట్ పోలీసుల అప్రమత్తత- తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి బ్లూకోర్ట్ పోలీసుల అప్రమత్తత- తప్పిన పెను ప్రమాదం

బెజ్జంకి,ఏప్రిల్ 1(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీసుల సమయ స్పూర్తితో పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. అర్ధరాత్రి విధుల్లో ఉన్న బ్లూ కోర్ట్ సిబ్బంది శ్రీనివాస్,రవి కుమార్ ప్రధాన రహదారిపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్‌ను గమనించారు.వారు వెంటనే వారు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే జూనియర్ లైన్మెన్ భార్గవ్ సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.ఈ క్రమంలో బెజ్జంకి పోలీసుల సమయస్ఫూర్తిని ప్రజలు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular