📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialబోడుప్పల్ గీత కార్మిక  ఆస్తులను సొసైటికి అప్పగించేందుకు ఎప్పుడైనా సిద్ధం: పొన్నం రవిగౌడ్ 

బోడుప్పల్ గీత కార్మిక  ఆస్తులను సొసైటికి అప్పగించేందుకు ఎప్పుడైనా సిద్ధం: పొన్నం రవిగౌడ్ 

📰 Generate e-Paper Clip

బోడుప్పల్ గీత కార్మిక

ఆస్తులను సొసైటికి అప్పగించేందుకు ఎప్పుడైనా సిద్ధం: పొన్నం రవిగౌడ్

 

మేడిపల్లి మార్చి 26 (మన ప్రజావాణి)బోడుప్పల్ కల్లుగీత కార్మిక సొసైటి ఆస్తులను అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పొన్నం రవిగౌడ్ స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం ఆయన బోడుప్పల్ లో సొసైటీ సభ్యులతో కలసి ఆయన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ కల్లు గీత కార్మిక సొసైటీ ఆస్తులను తాను కబ్జా చేశారని కొంతమంది చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.తన పేరు మీదు ఉన్న సొసైటి ఆస్తులను అప్పగించడానికి తాను మున్సిపల్

కార్యాలయానికి ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని,తనకు తేదీ, సమయం ఇవ్వాలని రవిగౌడ్ వెల్లడించారు.అదే సమయంలో మెయిన్ రోడ్డులోని కల్లు

కంపౌండ్ను కూడా సొసైటికి అప్పగించాలని పొన్నం రవిగౌడ్ స్పష్టం చేశారు. కొంతమంది సొసైటీ సభ్యులు తనను బద్నాం చేసేందుకు

ప్రయత్నిస్తున్నారన్నారు. తనతోనే 180 మంది సభ్యులున్న సొసైటీ బతుకుతుందన్న మాటలు తాను అనలేదని,కొంత మంది సొసైటీ సభ్యుల మూలంగా 180 మంది సభ్యులు రోడ్డున పడతారని మాత్రమే అన్నానన్నారు. సొసైటిలోని పెద్దమనుషులు తనకుటుంబ సభ్యులకు ఏ కేటగిరి సభ్యత్వాన్ని కల్పించుకున్నారని,చాలా

సంవత్సరాలుగా బి కేటగిరిలో ఉన్న సభ్యులకు ఏ కేటగిరి సభ్యత్వం ఎందుకు ఇవ్వడంలేదని రవిగౌడ్ ప్రశ్నించారు. అందరికి సమానవాటా ఇవ్వాలన్నదే తన

అభిప్రాయని,దీన్ని జీర్ణించుకోలేకనే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి బి కేటగిరిలో ఉన్న 31 మందికి అందరితో సమానంగా వాటాలు చెల్లిస్తామని పొన్నం రవిగౌడ్ ప్రకటించారు.తమకు సమాన వాటాలు చెల్లిస్తామని రవిగౌడ్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీ కేటగిరి సభ్యులు పొన్నం

రవిగౌడ్ ని శాలువతో సన్మానించారు.అదేవిధంగా కల్లు కంపౌండ్ ప్రహారీ గోడను రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు కూల్చివేయిస్తే.

చేయించాననే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో తన ప్రమేయం ఉన్నట్లు తేలితే తాను, తనపిల్లలతో కలసి సొసైటికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని,ఆ పనిని తానే రవి గౌడ్ సవాల్ విసిరారు.తర్వాత బి కేటగిరి సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తాము సొసైటిలో బి కేటగిరి సభ్యులుగానే ఉంటున్నామని.తమకు ఏ

కేటగిరి సభ్యులుగా పరిగణించాలని కోరారు.ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు పొన్నం వెంకటేశ్ గౌడ్,తరుణ్ గౌడ్,వర్మల బాలమణి గౌడ్,వి లింగం గౌడ్, అశోక్ గౌడ్,వర్కల శివకిశోర్ గౌడ్,కె రవి గౌడ్,

పోన్నం రఘువీర్ గౌడ్, పొన్నం సాయి గౌడ్, శంకర్ గౌడ్,నర్సింహ్మ గౌడ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular