📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో "ఎన్ఎస్ఎస్ - మెడిగో హాస్పిటల్" సహకారంతో వయోజన టీకాల అవగాహన...

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో “ఎన్ఎస్ఎస్ – మెడిగో హాస్పిటల్” సహకారంతో వయోజన టీకాల అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

తిరుపతి ప్రజావాణిన్యూస్(మార్చి25)రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వయసుతో సహజం.కొన్ని వ్యాధులు పెద్దవారిలో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి (ఉదా:ఇన్‌ఫ్లుయెంజా- న్యుమోనియా)పిల్లల టీకాలు జీవితాంతం రక్షణ ఇవ్వవు, కాబట్టి బూస్టర్ డోసులు అవసరం.శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని సావేరి సెమినార్ హాల్ లోఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐ.వి లలిత్ కుమారి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.వి.జ్యోత్స్న కల్పనా (యూనిట్-9),ఎం.పల్లవి (యూనిట్-10)మరియు ఆర్.దివ్య (యూనిట్-12),మెడిగో హాస్పిటల్ తిరుపతి వారితో కలిసి బుధవారం (25-03-2026) రోజు వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.టీకాలు పిల్లలకే కాకుండా యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు కొన్ని ముఖ్యమైన వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.ఈ సందర్భంగా మెడిగో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.సజిత్ టీకాల అవసరం,వాటి ప్రాముఖ్యతను వివరించారు మరియు మెడిగో హాస్పిటల్ సంక్రమణ వ్యాధుల నిపుణురాలు డా.వాసిరెడ్డి తేజ వయోజనులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల టీకాలను వివరించి,అనేక సంక్రమణ వ్యాధుల నివారణ మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లో టీకాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు.అన్ని వయసుల వారికి అవసరమైన ముఖ్యమైన టీకాలు మరియు వాటి ఉపయోగం అవి ఎప్పుడు వేయించుకోవాలి అనేది వైద్యుల సలహాలు ఇవ్వడం జరిగింది.ముఖ్యమైన టీకాలు:1ఇన్‌ఫ్లుయెంజా  జలుబు,ఫ్లూ,శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ-ప్రతి సంవత్సరం ఒకసారి.2టెటనస్,డిఫ్తీరీయా,పెర్టుసిస్  గాయాలు,గొంతు ఇన్ఫెక్షన్,కుక్కదగ్గు నుంచి రక్షణ  ప్రతి 10 ఏళ్లకు ఒకసారి.3హెపటైటిస్ బి -కాలేయ సంబంధిత ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ రస్క్ ఉన్నవారికి తప్పనిసరి.4హెపటైటిస్ ఏ కలుషిత ఆహారం/నీటి వల్ల వచ్చే కాలేయ ఇన్ఫెక్షన్  అవసరమైతే,ముఖ్యంగా ప్రయాణికులకు.5గర్భాశయ క్యాన్సర్,ఇతర సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ 9–26 ఏళ్ల వయసులో,మహిళలకు ముఖ్యం.6న్యుమోకాకల్ న్యుమోనియా,చెవి/రక్త ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ 50 ఏళ్లు పైబడినవారికి.7బూస్టర్ -కరోనా వైరస్ నుంచి రక్షణ,ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.8చికెన్‌పాక్స్  షింగిల్స్ చిన్నపాక,షింగిల్స్ నుంచి రక్షణ 50ఏళ్లు పైబడినవారికి.ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు,ఇంజనీరింగ్, ఎమ్ఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.