📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamరైతు భరోసా నిధుల విడుదలపై హర్షం.

రైతు భరోసా నిధుల విడుదలపై హర్షం.

📰 Generate e-Paper Clip

పాలేరు నియోజకవర్గ గిరిజన ఎస్టీ సెల్ అధ్యక్షులు కొర్ర రమేష్ నాయక్.

9రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

పెట్టుబడి సాయంతో రైతులకు ఊరట.

కాంగ్రెస్ ప్రభుత్వం పై నాయకుల ప్రశంసలు.*

పాలేరు,ప్రజావాణి:

రైతు భరోసా నిధులను సకాలంలో విడుదల చేసి రైతులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గిరిజన ఎస్టీ సెల్ అధ్యక్షులు, పాలేరు నియోజకవర్గ నాయకుడు కొర్ర రమేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన కొనియాడారు.వానాకాలం రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం ఒక రికార్డు సాధనగా నిలిచిందని తెలిపారు. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కుతుందని పేర్కొన్నారు.అలాగే ఎండాకాలం పంటల పెట్టుబడి సాయంగా భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడం రైతులకు ఎంతో ఉపయుక్తమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని చెప్పారు.ఈ సందర్భంగా రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular