పడకల్ పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ తరగతి గది ప్రారంభం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 23(ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్, మండల విద్యాధికారి (MEO) సముద్రాల హరికృష్ణ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చిన్నతనం నుంచే నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రీ-ప్రైమరీ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గదిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా వారు అభినందించారు. అనంతరం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రవికుమార్, ఉపాధ్యాయులు మామిడి సంతోష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ జయ, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ తిరుమల, విద్యార్థుల తల్లిదండ్రులు, యువజన నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




