గుల్లకోటలో ముస్లిం సోదరులకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి 21 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో తోఫాలను పంపిణీ చేశారు. శనివారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వయంగా ముస్లిం కుటుంబాలకు కానుకలను అందజేశారు. గ్రామస్తుల సంక్షేమం పట్ల సర్పంచ్ చూపుతున్న చొరవను అభినందిస్తూ, ముస్లిం సోదరులు మల్లేష్ గౌడ్‌ను శాలువాతో ఆత్మీయంగా సన్మానించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలగడం సంతోషకరమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ అరిగేల జయమ్మ రవి, గ్రామ కార్యదర్శి మహమ్మద్ హఫీజ్, వార్డ్ సభ్యులు పాలకుర్తి తిరుపతి, బిసగోని అంజలి, తిరుపతి, గోనె సంతోష్ గౌడ్, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.గ




