📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రస్థాయి జర్నలిస్టుల సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

రాష్ట్రస్థాయి జర్నలిస్టుల సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి; రాష్ట్రస్థాయి జర్నలిస్టుల సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై ప్రశంసలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ “చలో విజయవాడ” కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పనితీరుపై రాష్ట్రస్థాయి జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రశంసలు కురిపించారు. సభ వేదికపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టుల సమక్షంలో ఎమ్మెల్యే చేపడుతున్న కార్యక్రమాలను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ముఖ్యంగా జీలుగుమిల్లి ప్రాంతంలో విలేకరులకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే చూపుతున్న చొరవను ప్రశంసిస్తూ, జర్నలిస్టుల సంక్షేమంపై ఆయనకు ఉన్న గౌరవం, కట్టుబాటు స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తర్వాత జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇళ్ల స్థలాల పంపిణీ పనిని ముమ్మరం చేస్తున్న నాయకుడిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జర్నలిస్టు సంఘాల నాయకులు కొనియాడారు.ఈ సందర్భంగా సభలో పాల్గొన్న జర్నలిస్టులు మరియు సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేపడుతున్న కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.