📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్తంబళ్లపల్లె నియోజకవర్గానికి రూ. 26.62 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు

తంబళ్లపల్లె నియోజకవర్గానికి రూ. 26.62 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు

📰 Generate e-Paper Clip

తంబళ్లపల్లె నియోజకవర్గానికి రూ. 26.62 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు మదనపల్లె, ఫిబ్రవరి 27:
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పేద ప్రజల వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ. 26,62,815/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) చెక్కులను శుక్రవారం మదనపల్లెలోని టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, 41 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.​ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఓసి (LOC) విధానాన్ని సరళీకృతం చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్య సహాయం అందుతోందని పేర్కొన్నారు. కేవలం వైద్యమే కాకుండా, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, నిరుద్యోగ భృతి మరియు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు.​ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు, క్లస్టర్ మరియు బూత్ ఇంచార్జులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.