రైతుల అవసరాల కోసం అచ్చు యంత్రం బహుకరణ
వంగపల్లి గ్రామంలో సేవాభావంతో ముందడుగు
ప్రజావాణి నవంబర్ 27
కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన మోర్తాల మౌనకర్ తన తండ్రి మోర్తాల వెంకటేశ్వర రెడ్డి జ్ఞాపకార్థం రైతులకు ఉపయోగపడే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వంగపల్లి రైతు వేదికలో వినియోగించేందుకు అచ్చు యంత్రాన్ని బహుకరించారు ఈ యంత్రాన్ని ఏఈఓ జయప్రకాష్ రెడ్డికి అందజేశారు
తన తండ్రి జ్ఞాపకార్థం రైతులకు ఉపయోగపడే విధంగా అచ్చు యంత్రాన్ని అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు రైతుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు

