ఇనుగుర్తి ఇన్చార్జి ఎంపీడీవో గా హరీష్
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఇన్చార్జి ఎంపీడీవోగా కేసముద్రంలో ఎంపీవో గా విధులు నిర్వర్తిస్తున్న తోట హరీష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఇంచార్జ్ ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండారు పార్థసారధి గతంలో పనిచేసిన పెద్దవంగరకు తిరిగి ఎంపీవోగా వెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇనుగుర్తి కి హరీష్ ఇన్చార్జి ఎంపీడీవో గా జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.అన్ని పక్షాల ప్రజలు సహకరించాలని కోరారు.

