*సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచార శ్రీనివాస్ రెడ్డి.*
నస్రుల్లాబాద్ నవంబర్ 19 (ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పేద ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సి ఎం ఆర్ ఎఫ్) ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో మందికి ఊరట అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అర్హులైన లభ్యదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. నస్రుల్లాబాద్ మండలం 15 మందికి లబ్బిదారులకు రూపాయలు.5,10,500/-చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ప్రజల కష్ట కాలంలో అండగా నిలుస్తున్న సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్బిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండలం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

