📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅనుకున్న సమయం కంటే ముందే చందనం తొలగింపు కార్యక్రమం పూర్తి

అనుకున్న సమయం కంటే ముందే చందనం తొలగింపు కార్యక్రమం పూర్తి

📰 Generate e-Paper Clip

అనుకున్న సమయం కంటే ముందే చందనం తొలగింపు కార్యక్రమం పూర్తి

మల్యాల, నవంబర్ 19 (ప్రజావాణి):

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి చందనోత్సవ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించే కార్యక్రమాన్ని అనుకున్న సమయం కంటే ముందుగానే విజయవంతంగా పూర్తి చేశారు.

బుధవారం స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని ఆలయ అర్చకులు, అధికారులు శాస్త్రోక్తంగా తొలగించారు. అనంతరం తొలగించిన చందనాన్ని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, రీజినల్ జాయింట్ కమిషనర్ శ్రీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో తూకం వేయగా మొత్తం 99 కిలోల 720 గ్రాములు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అనంతరం తొలగించిన చందనానికి సంబంధించి పంచనామా నిర్వహించి, తగిన భద్రతా చర్యలు చేపట్టారు. చందనాన్ని సీల్ చేసి భద్రపరిచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

చందనోత్సవ కార్యక్రమాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.