📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగాంధీపురం సచివాలయంలో ‘లాగిన్’ కలకలం

గాంధీపురం సచివాలయంలో ‘లాగిన్’ కలకలం

📰 Generate e-Paper Clip

గాంధీపురం సచివాలయంలో ‘లాగిన్’ కలకలం!

ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ధ్రువపత్రాల జారీ?

మన ప్రజావాణి
మదనపల్లె, నవంబర్ 18:

పట్టణంలోని గాంధీపురం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రైవేట్ వ్యక్తికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు వ్యక్తి ప్రభుత్వ పోర్టల్‌లోకి ప్రవేశించి కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు జారీ చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు కేటాయించిన లాగిన్ వివరాలను ఇతరులకు అందించడం నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడంతో పాటు, అర్హత లేని వారికి ధ్రువపత్రాలు జారీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సచివాలయంలో గత కొన్ని నెలలుగా జారీ చేసిన ధ్రువపత్రాలపై సాంకేతికంగా విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లాగిన్ వివరాల వినియోగం, ఐపీ అడ్రస్‌లు, జారీ సమయాలను పరిశీలించి ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుతేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.