📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMuluguవ్యాసరచనలో గెలిచిన పిల్లలకు కలాం ఫౌండేషన్ బహుమతులు

వ్యాసరచనలో గెలిచిన పిల్లలకు కలాం ఫౌండేషన్ బహుమతులు

📰 Generate e-Paper Clip

 

చదువుకు బహుమతి… ప్రతిభకు గుర్తింపు

గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థుల సందడి

కలాం ఫౌండేషన్… పిల్లల భవిష్యత్తుకు బాట

లక్ష్మీదేవిపేటలో విద్యార్థులకు బహుమతుల పండగ

.కలాం పౌండేషన్ అధ్యక్షులు ఎం.డి.సర్వర్..
.ప్రధాన కార్యదర్శి పెండ్యాల సలేంద్రం.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి )

కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేటలో నేడు విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం!
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు నేడు బహుమతులు అందజేయనున్నారు.
కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.డి. సర్వర్, ప్రధాన కార్యదర్శి పెండ్యాల సలేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించారు… వ్యాసరచనలో తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ వేదిక!
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ బిక్షపతి, లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్ బొమ్మకంటి వంశావతి రమేష్, ఉప సర్పంచ్ కొండ తిరుపతి హాజరుకానున్నారు.
అలాగే లైబ్రేరియన్ శంకర్, వెంకటాపూర్ మండల తాసిల్దార్ గిరిబాబు ముదిరాజ్, ఎంపిడిఓ మూడురాజు, ఎస్ఐ చల్లా ధర్మరాజు, ప్రియనేస్తం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంగిలి నాగరాజు పాల్గొననున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజేతలను అభినందించాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.