ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్ డాగ్ స్క్వాడ్, యాంటీ డ్రగ్ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. వివేకానంద చౌరస్తా, బస్టాండ్ పరిసరాల్లోని కిరాణా, పాన్ షాపులు, టీ స్టాళ్లలో గంజాయి కోసం తనిఖీ చేశారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, గంజాయి విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ఎస్సై సూచించారు.

