📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనెల్లికుదురు ప్రజావాణి కి 7 దరఖాస్తులు..

నెల్లికుదురు ప్రజావాణి కి 7 దరఖాస్తులు..

📰 Generate e-Paper Clip

నెల్లికుదురు ప్రజావాణి కి 7 దరఖాస్తులు..
ఎంపీడీవో కుమార్
ప్రజావాణి,నెల్లికుదురు:ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారం వారం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన ప్రజావాణి కొనసాగుతోంది. మండల కేంద్రం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో సింగారపు కుమార్ ,స్థానిక తహసిల్దార్ చంద నరేష్ తో పాటు 28 శాఖల అధికారులు పాల్గొని ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కుమార్ దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. ప్రజావాణి కి మండల వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై 07దరఖాస్తులు అందజేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ సమస్యలపై 3 దరఖాస్తులు, హౌసింగ్ 2, విద్యుత్ సమస్యపై 1,పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పై1 ఫిర్యాదు సంబంధిత బాధితుల నుంచి వచ్చినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. ప్రజావాణిలో పలు శాఖలకు చెందిన అధికారులు హాజరవుతున్న దృష్ట్యా సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక చక్కని వేదికని,మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.