**ప్రతి నీటి చుక్కా విలువైనదే.. నీటి సంరక్షణే లక్ష్యంగా సర్పంచ్ బిల్లా యాదగిరి ముందడుగు!**
హనుమకొండ జిల్లా, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ సోక్ పిట్ (ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు సర్పంచ్ మీ బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల డ్రైనేజీ కాలువల ద్వారా బయటకు వెళ్లే నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వృథాను అరికట్టడం ఈ నిర్మాణం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే నీరు నిల్వ ఉండకుండా చేసి దోమల నివారణకు, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, ప్రధానోపాధ్యాయులు సత్యం, వార్డు సభ్యులు రణధీర్ రెడ్డి, ప్రశాంత్, ప్రవళిక, సునీల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

