📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షుడిగా రాజబొల్లారం రాజేష్ నియామకం

ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షుడిగా రాజబొల్లారం రాజేష్ నియామకం

📰 Generate e-Paper Clip

మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం అధ్యక్షుడిగా రాజబొల్లారం రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజబొల్లారం రాజేష్ యువతను సమన్వయం చేసుకుంటూ, యువతలో పార్టీ పట్ల మరింత చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి తన నాయకత్వంలో మరింత కృషి చేయాలని కోరారు.
యువతను ఐక్యంగా ముందుకు నడిపిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రాజకీయ ప్రస్థానంలో మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.