ఆరేళ్లుగా అసంపూర్తిగా బెజ్జంకి–బేగంపేట రహదారి పనులు!
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని పనులు వెంటనే పూర్తి చేయాలి – సీపీఐ
బెజ్జంకి, నవంబర్ 16 (ప్రజావాణి)
బెజ్జంకి–బేగంపేట రహదారి, గుగ్గిళ్ల–తంగళ్లపల్లి బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం రూ.8 కోట్ల నిధులు మంజూరైనా, ఆరేళ్లుగా పనులు అసంపూర్తిగా ఉండటంపై సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగెం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన అధికారికి ఫిర్యాదు చేశారు. నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

