*ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ*
*శరణు ఘోషలతో మార్మోగిన సాకేత్ గృహ సముదాయం*
మేడ్చల్: గుడ్లపొచంపల్లి డివిజన్ గౌడవెల్లి పరిధిలోని సాకేత్ గృహ సముదాయంలో మాజీ ఎంపీపీ పద్మజగన్ రెడ్డి నివాసంలో శనివారం అయ్యప్ప స్వామి పడిపూజను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రోహిత్ రెడ్డి, వంశీ వర్ధన్ రెడ్డి స్వాముల ఆధ్వర్యంలో జరిగిన పడి పూజలో అయ్యప్ప స్వాముల శరణు ఘోషలు మార్మోగాయి. ప్రముఖ భజన కళాకారుడు జడల రమేష్ బృందం ఆలపించిన భక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భజనలు, శరణు ఘోషల మధ్య పూజా కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్, గుండ్లపొచంపల్లి, పూడూరు, కిష్టాపూర్ డివిజన్లతో పాటు మనోహరాబాద్, కాళ్లకల్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అయ్యప్ప స్వాములు పడి పూజలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ శ్రీదేవి, మాజీ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డితో పాటు పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరుకావడంతో సాకేత్ గృహ సముదాయం శనివారం భక్తి శ్రద్ధలతో, శరణు ఘోషలతో మార్మోగింది.

