📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగీతాంజలి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

గీతాంజలి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

గీతాంజలి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఆకట్టుకున్న ఫైర్ రవి మ్యాజిక్ షో
ముదిగొండ నవంబర్ 14 ప్రజావాణి
ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో
బాలల దినోత్సవం సందర్భంగా గీతాంజలి స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంది. మ్యాజిక్ ప్రదర్శనలతో విద్యార్థులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై. నాసరయ్య, ప్రిన్సిపాల్ శోభారాణి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
విద్యార్థులతో కలిసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులలో సృజనాత్మకతను, ఆనందాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
చిన్నారుల నవ్వుల మధ్య, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.