ఎల్లంపేట్ గ్రామంలోని స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారులతో కొంత సమయం గడుపుతూ వారితో సరదాగా ముచ్చటించారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి మంచి భవిష్యత్తు ఉండాలని, వారు విద్యలో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, వారి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తనను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన స్నేహ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు.
బాలల దినోత్సవ వేడుకల్లో చిన్నారులతో సందడి చేసిన 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ గౌడ్
RELATED ARTICLES

