📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవ ఎన్నిక

బేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

బేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవ ఎన్నిక

దళితుల సంక్షేమం, హక్కుల సాధనకు కృషి చేస్తా-నూతన అధ్యక్షులు కొమ్ము కోటి

బెజ్జంకి, నవంబర్ 12 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మానకొండూర్ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు,బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిని ప్రశాంత్,సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ జనగాం శంకర్ ఆధ్వర్యంలో గ్రామ ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కొమ్ము కోటిని, ఉపాధ్యక్షులుగా కాడ మంచి సంపత్, బెజ్జంకి భాస్కర్ (సృజన్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు కొమ్ము కోటి మాట్లాడుతూ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా దళితుల సంక్షేమం, హక్కుల సాధనతో పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు,గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొరివి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బర్ల లింగయ్య, ఏల హరీష్, రాజగాని ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ నూనె రాజేందర్, పత్రీ రవి, బెజ్జంకి అంజయ్య, బర్ల బాబు, బర్ల సంజీవ్, అన్నజీ చిన్న, బెజ్జంకి రాజయ్య, గొడుగు సంతోష్, బెజ్జంకి శ్రీనివాస్, కొరివి కొమురయ్య, యూత్ కాంగ్రెస్ బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడు పిట్టల అరుణ్ తదితర నాయకులు,ఎస్సీ సెల్ ప్రతినిధులు,యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.