సొంతింటి కల నెరవేర్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు
గాగిల్లాపూర్ గ్రామ సర్పంచ్ కనకచంద్రం
మద్దూరు నవంబర్8, ప్రజా వాణి,
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో ఇంద్రమ్మ లబ్ధిదారుడు బండి గణేష్ నివాసంలో దీపాలు వెలిగించి కాకర్స్తో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి దంపతులను శాలువాతో సన్మానించారు.ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేక మల్లేశం,వార్డు సభ్యులు మేక కనకయ్య,బసవరాజ్ స్వామి, ఏలూరు శివ,ఏలూరి పరశురాములు గ్రామ శాఖ అధ్యక్షులు బండి బాలయ్య, యూత్ నాయకులు శ్రీరాముల వెంకటేష్ ఏలూరు భాస్కర్ ఇట్టబోయిన మధు బోయిని కృష్ణ చింతల కనకయ్య మేక కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

