వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రేబర్తి ప్యాక్స్ చైర్మెన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి
వల్లంపట్ల,కూటిగల్ గ్రామాల్లో కొనుగోలు ప్రారంభం
మద్దూరు నవంబర్5, ప్రజా వాణి,
మండలంలోని వల్లంపట్ల, కూటిగల్ గ్రామాల్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేబర్తి ప్యాక్స్ చైర్మెన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి, సర్పంచులు కర్నె సునీత మనోహర్, దాసారం బాలకృష్ణ చేతుల మీదుగా గురువారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం పండించిన రైతులు ప్యాక్స్ ద్వార ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు కిరణ్, అనిత,సి ఈ ఓ శ్రీదర్,ఉపేందర్, ఏ ఈ ఓ కల్పన, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు, గ్రామ పెద్దలు, హమాలీలు పాల్గొన్నారు.

