📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలి

మూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలి

📰 Generate e-Paper Clip

మూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలి

కలెక్టర్‌కు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల వినతి

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

మంచిర్యాల జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు మూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ & జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలో నిరంతరం శ్రమిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు మూడవ విడత అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణ ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో, అక్రిడిటేషన్ కార్డులే ప్రామాణికం కానున్నాయని పేర్కొన్నారు. కార్డుల జారీలో జాప్యం జరిగితే అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు వైద్య సదుపాయాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు మొదటి రెండు విడతల్లో మిగిలిపోయిన అర్హుల దరఖాస్తులు ఇప్పటికే పరిశీలన దశలో ఉన్నందున, తక్షణమే జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన వారందరికీ మూడవ విడత కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రంసమర్పించిన వారిలో కమిటీ సభ్యులు రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి, డేగ సత్యం, పార్వతి సురేష్, అలుగువెల్లి రమేష్ రెడ్డి, ఐనంపూడి నవీన్, బెక్కం సదానందం ఉన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.