*గుజరాత్ లో జరిగే ఐక్యతా దినోత్సవ వేడుకలలో నల్గొండ జిల్లా బృందం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 నల్గొండ జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ ఆలీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 31 నుంచి జాతీయ సమైక్యత దినోత్సవము ను ప్రారంభించారు. 565 సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి భారత దేశపు ఉక్కుమనిషిగా పేరుగాంచిన వల్లభాయ్ పటేల్ 143 వ జయంతి ని పురస్కరించుకొని 2018 అక్టోబర్ 31 వ తేదీన వల్లభాయ్ పటేల్ ఐక్యతా చిహ్నమును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నక్సల్ ముక్త్ భారత్ సాధించినందుకు గాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ గౌరవ చంద్రశేఖర్, జిల్లా సూపరిండెంట్ పోలీస్ శరత్ చంద్ర పవర్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వివిధ రంగాల నుంచి 15 మందిని ఎంపిక చేసి జాతీయ ఐక్యత పరేడ్ 2026 విక్షణకు ఎంపిక చేయడం జరిగినది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఘనంగా గుజరాత్ లోని నర్మదా నది తీరంలో ఉన్న సాదు బెట్ట దీవిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు జిల్లాల నుంచి వివిధ రంగాలలో (పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రొఫెషనల్, ఏంట్ర ప్రెన్యూర్, జనరల్ పబ్లిక్, స్టూడెంట్స్) సేవలందిస్తున్న ఈ బృందం నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యామ్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే 182 (597అడుగులు) మీటర్ల పొడవైన అతి పెద్దదైన
సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మించిన ఐక్యతా ప్రతిమ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించారు. గుజరాత్ లో జరిగే రాష్ట్రీయ ఏక్తా దివస్ లో పాల్గొన్నవారు. ఈ ఏక్తా దివస్ పరేడ్ 2026లో నోడల్ ఆఫీసర్ నల్గొండ జిల్లా మహ్మద్ అక్బర్ ఆలీ, నల్గొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగు కోటయ్య, నల్గొండ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆవుల మాధవి, చిన్న కాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, జప్తి వీరప్ప గూడెం గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఇసుకబావి గూడెం గ్రామ సర్పంచ్ కల్లూరి అనిత, కొప్పోల్ గ్రామ సర్పంచ్ ఙ్ఞానలత, మైనంపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, వెంకటరెడ్డి, జెడ్ ఎస్ పెట్రోల్ బంక్ మేనేజర్ సంధ్యారాణి, పేపర్ ప్రొడక్ట్స్ మేనేజర్ మెండే పార్వతమ్మ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల నుంచి కె తరుణ్ విద్యార్థి, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ యం సాయి పవన్ విద్యార్థి, కె పి యం జూనియర్ కళాశాల ఎస్ హర్షిత్, టి జి యం గుర్రంపాడు ఆర్ చైతన్య పాల్గొన్నారు.


