📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు
వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 31, ప్రజావాణి:

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు కురవి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల సందడిగా సాగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో సత్యవతి రాథోడ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాదే నాగయ్య, బోడ శ్రీను, గుగులోతు నెహ్రూ నాయక్, ఐలి నరహరి, కళ్లెపు శ్రీను, నూతక్కి నరసింహారావు, నూతక్కి సాంబశివరావు, కొణతం విజయ్, ఆలయ మాజీ చైర్మన్ రాజు నాయక్, కురవి సర్పంచ్ లక్ష్మి రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ చిన్న బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.