మహా రుద్రాభిషేకం విజయంపై ఆదర్శ్ రెడ్డితో భాస్కర్ రెడ్డి భేటీ
అమీన్పూర్,అక్టోబర్ 27 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్ ఫేజ్-2లో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల నిర్వహించిన మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డిని మాజీ వార్డు సభ్యుడు, ఆలయ నిర్వాహకుడు భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ కమిటీ సభ్యులు, జయలక్ష్మి నగర్ కాలనీ వాసులతో కలిసి ఆదర్శ్ రెడ్డిని కలిసిన ఆయన, మహా రుద్రాభిషేకం విజయవంతానికి అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని ఆదర్శ్ రెడ్డిని కోరారు. ఆలయ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

