📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు

గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు

బెజ్జంకి, అక్టోబర్ 28 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించినట్లు గుర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్లూరు గ్రామ శివారు నుంచి ఖాసీంపేట గ్రామానికి వెళ్లే మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు, అన్నాడి కల్యాణ్ రెడ్డి (27) అనే వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి విచారించారు.
పంచుల సమక్షంలో నిర్వహించిన పరీక్షలో గంజాయికి సంబంధించిన ఫలితం సానుకూలంగా రావడంతో, బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.”మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి-యువతతో పాటు ప్రజలందరూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెజ్జంకి పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి, కుటుంబానికి, భవిష్యత్తుకు హానికరమని, ఎవరూ ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని,గంజాయి అక్రమ వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మత్తు పదార్థాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.