📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగోల్కొండ కోటలో సెక్యూరిటీ సిబ్బందికి కనీస వసతులేవీ

గోల్కొండ కోటలో సెక్యూరిటీ సిబ్బందికి కనీస వసతులేవీ

📰 Generate e-Paper Clip

గోల్కొండ కోటలో సెక్యూరిటీ సిబ్బందికి కనీస వసతులేవీ?

సిబ్బంది సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న పల్లం నరసింహారావు

హైదరాబాద్, సెప్టెంబర్ 28: (ప్రజావాణి )
చారిత్రక గోల్కొండ కోటలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐఎస్ (SIS) కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎండ నుంచి రక్షణకు నీడ లేకపోవడం, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గది అందుబాటులో లేకపోవడం, కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో సిబ్బంది విధి నిర్వహణలో అవస్థలు పడుతున్నట్లు తెలిసింది.
సిబ్బంది కష్టాలను తెలుసుకున్న పల్లం నరసింహారావు
గోల్కొండ కోటలో సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న పల్లం నరసింహారావు కోటను సందర్శించి, సిబ్బందితో నేరుగా మాట్లాడారు. వారి పని వేళలు, వేతనాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బందికి కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎండ నుంచి రక్షణ కల్పించేలా నీడ, విశ్రాంతి గది, కూర్చోవడానికి కుర్చీలు వంటి ప్రాథమిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు
సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పల్లం నరసింహారావు హామీ ఇచ్చారు. విధి నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతోపాటు, సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత సంస్థలకు సూచించాల్సిన అవసరం ఉందన్నారు.
చారిత్రక కట్టడాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతలో కీలక పాత్ర పోషించే సెక్యూరిటీ సిబ్బందికి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండటం అత్యవసరం. వారి సమస్యలను సంబంధిత అధికారులు సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.