గూడెంగుట్ట సత్యనారాయణస్వామి ఆలయంలో పౌర్ణమి జాతర
సత్యదేవుని దర్శించుకున్న వందలాది మంది భక్తులు
దండేపల్లి, అక్టోబర్ 26 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడెంగుట్ట శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో పౌర్ణమి జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి సత్యదేవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. మరికొంతమంది భక్తులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.
భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. సత్యదేవుని దర్శనం, ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలతో ఆలయంలో భక్తి సందడి నెలకొంది. పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు

