📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వ భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు

ప్రభుత్వ భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు
దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి – డాక్టర్ ఆకుల అజయ్ కుమార్
దండేపల్లి, అక్టోబర్ 26 (ప్రజావాణి):
దివ్యాంగ పిల్లల శారీరక అభివృద్ధికి ఫిజియోథెరపీ ఎంతో దోహదపడుతుందని ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఆకుల అజయ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ప్రభుత్వ భవిత కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఫిజియోథెరపీ శిబిరంలో పలువురు దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా సేవలు అందించారు.
ప్రభుత్వ భవిత కేంద్రంలో గత సంవత్సరం నుంచి ప్రతి సోమవారం, శుక్రవారం దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఉచిత ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల శారీరక స్థితిని పరిశీలించి, వారి అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ చేస్తూ శారీరక సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగ పిల్లలకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ అందించడం ద్వారా కండరాల బలం, శరీర కదలికలు, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యం మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. తల్లిదండ్రులు వైద్య నిపుణుల సూచనల మేరకు ఇంటి వద్ద కూడా పిల్లలతో అవసరమైన వ్యాయామాలు చేయించాలని సూచించారు.
ప్రభుత్వ భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న ఉచిత ఫిజియోథెరపీ సేవలను దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఐఈఆర్టీ సునీల్, కేర్ గివర్ సౌజన్య, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.