📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూసుమంచి నూతన ఎస్సై సతీష్‌కు సన్మానం

కూసుమంచి నూతన ఎస్సై సతీష్‌కు సన్మానం

📰 Generate e-Paper Clip

కూసుమంచి నూతన ఎస్సై సతీష్‌కు సన్మానం
కూసుమంచి, అక్టోబర్ 21 (ప్రజావాణి):
ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సతీష్‌ను మండల కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, జీళ్ళచెరువు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్సై సతీష్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ సహకారం అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జీళ్ళచెరువు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొని నూతన ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.