జుక్కల్ ఎస్సై మురళి కు కౌలాస్ గ్రామ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 21
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఎస్సై మురళి కు కౌలాస్ గ్రామ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేష్ దసరా పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ…
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమ
దసరా పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా, శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించిన సందర్భానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూల సౌందర్యంతో కళకళలాడుతాయి. విజయదశమి రోజున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
ఈ పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించడంతోపాటు ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చింతనను చాటిచెబుతుంది. చెడు ఆలోచనలను విడనాడి మంచి మార్గంలో పయనించాలని, సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని దసరా పండుగ సందేశమిస్తోంది.
ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.

